స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, సెప్టెంబర్ 4: ఈనెల 7వ తేదీ నుంచి నిర్వహించుకునే వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి నిర్వాహకుడు సహకరించాలని నార్కెట్పల్లి క్రాంతికుమార్ పేర్కొన్నారు. బుధవారం నార్కెట్పల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్వహించిన పీస్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉత్సవాలను జరుపుకొని సహకరించాలని కోరారు