స్వేచ్ఛ న్యూస్, ఆగస్టు 15, నార్కెట్ పల్లి: 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం నార్కట్పల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు కొరివి శంకర్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో నిర్వహించారు. అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు ఘర్ ఘర్ తిరంగా యాత్ర లో భాగంగా మండల కేంద్రంలోని మెయిన్ రోడ్డు, నల్లగొండ రోడ్డు, బీసీ కాలనీ తదితర ప్రధాన వీధులలో తిరంగా యాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మునుకుంట్ల గణేష్, మేడబోయిన శ్రీనివాస్, పాల్వాయి భాస్కరరావు, ముంత నరసింహ, వడ్డేగోని రామలింగం, లింగస్వామి, మండల నాయకులు ఉండ్రాతి నవీన్, ఏర్పుల పరమేష్, పాలకూరి రమేష్, అంతటి రవి, రాయగిరి శివశంకర్, జమల నవీన్ రెడ్డి, నర్సిరెడ్డి, పనస ఉపేందర్, పానుగుల శివ, మంద ప్రవీణ్, రావుల తిరుమలేష్, నీలం శివరాం, ఉండ్రాతి అంజి, పట్టేటి సుందర్, దినేష్ తదితరులు పాల్గొన్నారు.