
స్వేచ్ఛ న్యూస్, ఫిబ్రవరి 8, నార్కెట్పల్లి: నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు పోతులపాటి రామలింగేశ్వర శర్మ ఆధ్వర్యంలో కార్యనిర్వాహణాధికారి నవీన్, వేద పండితులు శ్రీకాంత్ శర్మ, సురేష్ శర్మ లతో పాటు స్వామివారి అర్చక బృందం అందరి చేత స్వామివారికి అష్టోత్తర శతకళాశాలచే అభిషేకం నిర్వహించి అనంతరం సూర్య నమస్కారాలు చేశారు ఆ తర్వాత దీక్ష హోమం నిర్వహించి బలిహరణ జయాది హోమం అనంతరం మహా పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం స్వామివారికి క్షేత్రపాలకుడైన కాలభైరవునికి విశేషమైన అభిషేకాలు నిర్వహించారు. ఆ తర్వాత సాయంత్రం త్రిశూల స్నానం చేయించిన పండితులు వసంతోత్సవం నిర్వహించి పండితులకు సన్మానాలు చేసి మహదాశీర్వచనములు తీసుకున్నారు.
