స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, నవంబర్ 2: నార్కెట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ప్రాజెక్టు లో వ్యక్తి గల్లంతైన సంఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికులు పోలీసులు తెలిపిన వివవరాలా ప్రకారం అప్పాజీపేట గ్రామానికి చెందిన గుండాల శంకరయ్య నేరడలో తన వియ్యంకుడి ఇంటికి దీపావళి పండుగకు వచ్చాడు అనంతరం బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులో నీటిని తిలకించేందుకు వచ్చి ఈత కొట్టేందుకు ప్రయత్నించగా ప్రమాదవశాత్తు ఊపిరి ఆడక నీట మునిగి మృతి చెందాడు వెంటనే అగ్నిమాపక సిబ్బందిని పిలిపించి మృతదేహాన్ని గాలిస్తున్నట్లు నార్కెట్పల్లి ఎస్సై క్రాంతి కుమార్ తెలిపారు.