జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి

 

స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, అక్టోబర్ 1:  జర్నలిస్టుల హక్కుల సాధనకై తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ-IJU) పిలుపుమేరకు దేశవ్యాప్త నిరసన కార్యక్రమంలో  భాగంగా శుక్రవారం మండల కేంద్రంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో  మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ దేవరశెట్టి నారాయణ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని,నూతన మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, పాత్రికేయుల భద్రత కోసం జాతీయ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. రద్దు చేయబడిన వర్కింగ్ జర్నలిస్టు చట్టాల కింద గతంలో ఉన్న చట్టబద్ధమైన హక్కులను పునరుద్ధరించాలని, కొత్త వేతన మండలి (వేజ్ బోర్డు) ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు నల్గొండ నగరంతో పాటు జిల్లాలోని అన్ని మండలాల్లో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్లు, ఇండ్ల స్థలాలు కేటాయించాలన్నారు. జిల్లా ఉపాధ్యక్షులు ప్రజ్ఞాపురం శివ శంకర్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలపై ఐక్యంగా పోరాడుతూ, వారి న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరంతరం కృషి చేస్తామని, అర్హులైన జర్నలిస్టులకు వెంటనే హెల్త్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా ప్రచార కార్యదర్శి గర్థస్ వెంకన్న, భాశెట్టి శ్రీనివాస్, ప్రజ్ఞాపూరం కృష్ణ, పల్లె తిరుమల్,, బండారు రాంబాబు, దుబ్బాక నరేష్,రాధారపు రమేష్, కన్నెబోయిన నర్సింహా,జనిగే కృష్ణ, ఎలక్ట్రానిక్ మీడియా సోమ వెంకట్ రెడ్డి, చంటి,సిరిశెట్టి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *