పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం – పరవశించెను భక్తజనం

స్వేచ్ఛ న్యూస్, ఫిబ్రవరి 5, నార్కెట్పల్లి: శివనామ స్మరణలతో భక్తులు పరవశిస్తుండగా, వేద పండితుల మంత్రోచ్ఛరణలు ప్రతిధ్వనిస్తుండగా, భాజా భజంత్రీలు వాయిస్తుండగా మంగళ వాయిద్యాల చప్పుల్లతో, శోభాయ మానంగా తీర్చిదిద్దిన కళ్యాణ మండపంలో భవి నుండి భూవికి దిగి వచ్చిన త్రిలోక రక్షకులు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం బుధవారం తెల్లవారుజామున (రథసప్తమి సందర్భ సూర్య కిరణ సంహిత సందర్భములో) శైవాగమానుసారం చూడముచ్చటగా అంగరంగ వైభవంగా జరిగింది.



చూడముచ్చటగా స్వామి అమ్మవార్ల ఎదుర్కోలు.

స్వామివారి వార్షిక కళ్యాణోత్సవంలో భాగంగా బుధవారం తెల్లవారుజామున స్వామి వారిని నంది వాహనంపై, అమ్మవారిని ముత్యాల పల్లకిలో భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాలు నడుమ ప్రధాన ఆలయం నుంచి కళ్యాణ మండపం వద్దకు మాడవీధులలో తీసుకు వస్తున్న సందర్భంగా కళ్యాణ తంతులో ముఖ్యగట్టమైన ఎదుర్కోలు కార్యక్రమం భక్తులను ఎంతగానో ఆకర్షించింది. ఈ సందర్భంగా స్వామివారి తరుపున కొందరు భక్తులు అమ్మవారి తరఫున కొందరు భక్తులు తమ ఇంట్లో పెళ్లి జరుపుతున్న భావనతో బందు వర్గాల ఎదుర్కోలు కార్యక్రమం నిర్వహించి పరవశించిపోయారు.

ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు అందజేసిన ఎమ్మెల్యే

తెలంగాణ రాష్ట్రంలో సుప్రసిద్ధ సేవ క్షేత్రాలలో ఒకటిగా వెలుగొందుతున్న పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్థానిక నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పుష్ప దంపతులు స్వామి అమ్మవార్లకు నూతన పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు.

శైవాగమ పద్ధతిలో కళ్యాణం:

మాంగల్య ధారణ సంతు నిర్వహిస్తున్న పండితులు

సర్వేజనా సుఖినోభవంతు: సమస్తా సుఖినోభవంతు సృష్టిలోని సర్వలోకాల క్షేమం కొరకు ప్రతి సంవత్సరం నిర్వహించే స్వామి అమ్మవార్ల వార్షిక కళ్యాణం వేదాగమసార్వభౌమ, శైవాగమ చతురానన, వేదాక్షరసరస్వతి బిరుదాంకితులు, యాగ్నికులు శ్రీ అల్లవరపు సుబ్రహ్మణ్య దీక్షితావదాని ఆచార్యత్వమున, దేవాలయ ప్రధాన అర్చకులు పోతులపాటి రామలింగేశ్వర శర్మ పర్యవేక్షణలో శైవాగమ పండితులచే శాస్త్రోక్తముగా స్వామివారి కల్యాణానికి సకల దేవతలను ఆహ్వానించిన అనంతరం కళ్యాణ తంతు నిర్విఘ్నంగా జరగాలనే కాంక్షతో ఆ గణనాధునికి పూజలు చేశారు. హాజరైన భక్తులందరి చేత గణపతి పూజ నిర్వహించడం గమనార్హం అనంతరం కళ్యాణ తంతులో భాగంగా స్వామి వారి కాళ్లు కడుగు కార్యక్రమం తదుపరి కన్యాదానం అనంతరం జీలకర్ర బెల్లం తంతు నిర్వహించారు. అనంతరం నూతన వధూవరులు అయినా స్వామి అమ్మవార్లను ఒకరికొకరిని అద్దంలో చూపిస్తూ పరిచయం చేశారు. తదుపరి లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తూ ఓం నమశ్శివాయ అంటూ శివనామస్మరణలు చేస్తూ తన్మయత్వంతో పరవశించిపోతుండగా

ముత్యాల తలంబ్రాలను స్వామి అమ్మవార్లకు సమర్పిస్తున్న అర్చకులు

సూర్యోదయ సమయాన (06:31) సూర్య కిరణాలు స్వామి అమ్మ వార్ల పై ప్రసరిస్తుండగా మాంగల్యధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్ల స్పర్శతో వేద పండితులు ముత్యాల తలంబ్రాలను సమర్పించి కళ్యాణ ఘట్టాన్ని ముగించారు. అనంతరం భక్తులు తమ ఇష్టదైవాలకు కళ్యాణ సందర్భంగా తెచ్చిన తలంబ్రాలను సమర్పించి తమ మొక్కులను తీర్చుకున్నారు.

ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో నల్లగొండ ఆర్డిఓ అశోక్ రెడ్డి, బ్రహ్మోత్సవాల ప్రత్యేక అధికారి కృష్ణ, ఆలయ కార్య నిర్వహణ అధికారి నవీన్ కుమార్, వివిధ శాఖల సిబ్బందితోపాటు నాయకులు మాజీ జెడ్పిటిసి దూదిమెట్ల సత్తయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భత్తుల ఉషయ్య, వడ్డే భూపాల్ రెడ్డి, జెర్రిపోతుల భరత్, పాశం శ్రీనివాస్ రెడ్డి, సట్టు సత్తయ్య, సాగర్ల సైదులు, నేతగాని కృష్ణ, గడుసు శశిధర్ రెడ్డి, దూదిమెట్ల స్రవంతి, గడ్డం పశుపతి, ఆలయ సిబ్బంది శ్రీనివాస్ రెడ్డి, మహేందర్ రెడ్డి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

పటిష్ట బందోబస్తు

కళ్యాణ మహోత్సవానికి వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా నల్లగొండ డిఎస్పి శివరాం రెడ్డి, సిఐ నాగరాజు, ఎస్సై క్రాంతి కుమార్ ల ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ముఖ్యంగా కళ్యాణం అనంతరం కళ్యాణమండపంలోకి చేర్చుకొని వచ్చే భక్తులను నివారించడంలో పోలీసులు అద్భుతంగా పని చేశారు. భక్తుల కోరిక మేరకు భక్తుల తలంబ్రాలను స్వామివార్లకు సమర్పించి భక్తుల మన్ననలు పొందారు.

మళ్లీ మోరయించిన సౌండ్ సిస్టం:

బ్రహ్మోత్సవాలలో ఏర్పాటు చేసిన సౌండ్ సిస్టం మంగళవారం ప్రారంభ కార్యక్రమంలో అనేకసార్లు మొరాయించడంతో తీవ్ర ఇబ్బందులకు గురైన వేద పండితులు బుధవారం కళ్యాణ నిర్వహణ సమయంలో సైతం పలుమార్లు సౌండ్ సిస్టం తో ఇబ్బంది పడ్డారు.

శైవాత్మతో ఏకమవుతున్న శివసత్తువు

స్వామివారికి తలంబ్రాలు సమర్పించేందుకు వచ్చిన భక్తురాలు

భక్తులకు స్వామివారి నామాలు అలంకరిస్తున్న మహిళ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *