
స్వేచ్ఛ న్యూస్, ఫిబ్రవరి 19, నార్కెట్పల్లి: మరాఠా యోధుడు చత్రపతి శివాజీ మహారాజ్ హిందూ సమాజానికి చేసిన సేవలు అనిర్వచనీయమైనవని అతని దృఢ సంకల్పంతో నేటి హిందూ సమాజం నిలబడగలిగిందని నాడు శివాజీ లాంటి నాయకుడు లేకుంటే భారతదేశం పూర్తిగా ఇతర మతస్తుల కబంధహస్తాలలో నలిగిపోయేదని పలువురు వక్తలు పేర్కొన్నారు. బుధవారం చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా నార్కెట్పల్లి మండల కేంద్రంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ లో పట్టణంతోపాటు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన యువత పాల్గొని తమ హృదయ సామ్రాట్ శివాజీ మహారాజ్ గొప్పతనాన్ని కీర్తిస్తూ నినాదాలు చేస్తూ మండల కేంద్రంలోని మునుగోడు చౌరస్తా నుంచి అమ్మనబోలు చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మరాఠా యోధుడు శివాజీ హిందూ సమాజానికి చేసిన గొప్ప సేవలను కీర్తిస్తూ తన కుమారుడు శంభాజీ మహారాజుని ఔరంగజేబు పెట్టిన చిత్రహింసలను గుర్తుచేసుకొని వారి చిత్రహింసలకు నెరవకుండా మతం మారడానికి నిరాకరించి మత మార్పిడికి అడ్డుకట్ట వేసిన మొదటి గురువుగా సంభాజిని కీర్తిస్తూ యువకులు తన్మయత్వంతో ఊగిపోయారు. శివాజీ మహారాజ్ చేసిన సేవలు తరతరాలపాటు హిందూ యువతను మేల్కొల్పే విధంగా ఉంటాయని శివాజీని ఆదర్శంగా తీసుకొని నేటి యువత హిందూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ ధర్మరక్షణకు కంకణబద్ధులై తమ కర్తవ్యాన్ని నెరవేర్చాలన్నారు. ప్రాచీన కాలంలో ఇతర దేశాల నుంచి వలస వచ్చిన నాయకులు ఎన్ని చిత్రహింసలు పెట్టినా ఎలాంటి భయం, బెరుకు లేకుండా పాశ్చాత్తుల గుండెల్లో గుణపాలు దించిన శివాజీని తమ దేశ దైవంగా భావించి స్తుతించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు హిందూ వాహిని రాజు, బిజెపి నాయకులు పజ్జురు వెంకటరెడ్డి, మేడ బోయిన శ్రీనివాస్ యాదవ్, నోముల నాగరాజు, మునుకుంట్ల గణేష్, పుల్లెంల మహేష్, అనంతుల నాగరాజు, నల్లగొండ నాగరాజు, భాశెట్టి ప్రవీణ్, వడ్డేగోని రామలింగం, పాలకూరి రమేష్, శివ, బైరోజు ఉపేంద్ర చారి, ప్రవీణ్, పార్ధు, శేఖర్, రావుల తిరుమలేష్, అంజి, శివ తదితరులు పాల్గొన్నారు.
