ఇంపాక్ట్ క్లబ్ అఫ్ ఇంటర్నేషనల్ విజన్ బిల్డర్స్ నూతన కమిటీ ఎన్నిక

IMG 20261101 WA0006

స్వేచ్ఛ న్యూస్, హయత్ నగర్, నవంబర్ 01: ఇంపాక్ట్ క్లబ్ అఫ్ ఇంటర్నేషనల్ విజన్ బిల్డర్స్ నూతన కమిటీ ఎన్నిక జరిగింది. ఆదివారం క్లబ్ అధ్యక్షులు గూడూరు అంజిరెడ్డి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో నూతన కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షులుగా గుజ్జ జగన్ మోహన్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా బెలిదే శ్రీకాంత్, మల్లం వెంకటేశం గౌడ్, జాయింట్ సెక్రెటరీ మెరుగు శ్రవణ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ లావుడి వీర, చీఫ్ అడ్వైజర్ అమరేందర్ రెడ్డి, అడ్వైజర్ సామ నవీన్ రెడ్డి, నారి సెల్ కొనిజేటి అనిత, సర్వీస్ చైర్ పర్సన్ మందడి శ్రీధర్ రెడ్డి, ట్రైనింగ్ సర్వీస్ చైర్ పర్సన్ కాసర్ల మహేందర్ రెడ్డి, ఎంటర్టైన్మెంట్ ఛైర్ పర్సన్ బానోతు శ్రీను లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

ఈ సందర్బంగా గూడూరు అంజిరెడ్డి మాట్లాడుతూ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఆశయాలకు అనుగుణంగా నూతన కమిటీ కృషిచేయాలని కోరారు. అనంతరం ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ సంస్థ పిన్స్ అందచేశారు. అనంతరం క్లబ్ సెక్రటరీ నందికొండ రవీంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంపాక్ట్ స్వచ్ఛంద సేవా సంస్థలో పాల్గొని సమాజ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు. క్లబ్ ట్రెజరర్ బాలు చౌహాన్ మాట్లాడుతూ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ సంస్థ ద్వారా యువతకు చక్కటి మార్గ నిర్దేశనం చేస్తూ యువతను మంచి దారిలో నడిపించేందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నందికొండ వినోద, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *